క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌పై కన్నేసిన ఇండియా..

క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌పై కన్నేసిన ఇండియా..

భువనేశ్వర్: హాకీ వరల్డ్​కప్​లో ఇండియా క్వార్టర్​ఫైనల్​ బెర్త్​పై కన్నేసింది. గురువారం వేల్స్​తో జరిగే మ్యాచ్​లో భారీ తేడాతో నెగ్గి.. డైరెక్ట్​గా నాకౌట్​కు చేరాలని టార్గెట్​గా పెట్టుకుంది. ప్రస్తుతం పూల్​–డిలో ఇండియా, ఇంగ్లండ్​ ఖాతాలో చెరో నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే గోల్స్​ డిఫరెన్స్​ కారణంగా ఇంగ్లండ్​ (5) టాప్​లో ఉండగా, ఇండియా (2) సెకండ్​ ప్లేస్​లో కొనసాగుతున్నది. అయితే మన మ్యాచ్​ కంటే ముందు ఇంగ్లండ్​.. స్పెయిన్​తో తలపడనుంది. 

ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్​ ఓడినా, డ్రా చేసుకున్నా ఇండియాకు పెద్దగా ఇబ్బందిలేదు. కేవలం వేల్స్​పై విజయం సాధిస్తే డైరెక్ట్​గా క్వార్టర్స్​ బెర్త్​ లభిస్తుంది. ఒకవేళ ఇంగ్లండ్​.. స్పెయిన్​ను ఓడిస్తే, అప్పుడు ఇండియా.. వేల్స్​పై కనీసం ఐదు గోల్స్​ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. మొత్తానికి ఇంగ్లండ్​ విక్టరీ మార్జిన్​పై ఇండియా గోల్స్​ సంఖ్య ఆధారపడి ఉంటుంది.