ఫైనల్‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి.. నేడు శ్రీలంకతో హర్మన్‌‌‌‌సేన ఢీ

 ఫైనల్‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి.. నేడు శ్రీలంకతో హర్మన్‌‌‌‌సేన ఢీ

కొలంబో: ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో గెలిచిన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్‌‌‌‌‌‌‌‌.. మూడు దేశాల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఫైనల్‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టింది. ఆదివారం జరిగే తదుపరిపోరులో ఆతిథ్య శ్రీలంకను మరోసారి ఓడించి ఫైనల్ చేరుకోవాలని ఆశిస్తోంది. మరోవైపు ఇండియాతో తొలిపోరులో ఓడినా.. సౌతాఫ్రికాతో విజయంతో తిరిగి గాడిలోకి వచ్చిన శ్రీలంక పోటీలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఇండియానే ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తోంది. 

స్పిన్నర్లు స్నేహ్ రాణా, శ్రీ చరణి, బ్యాటర్లు ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్మన్‌‌‌‌ మెప్పిస్తున్నారు.హర్మన్‌‌‌‌‌‌‌‌సేన ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ కూడా మెరుగైంది. అయితే, పేసర్లు కాశ్వీ గౌతమ్, అరుంధతి రెడ్డి ఎక్కువగా రన్స్ ఇవ్వడం ఒక్కటే ఇండియాను ఇబ్బంది పెట్టే అంశం. ఈ సమస్యను సరిదిద్దుకుంటే హ్యాట్రిక్ విక్టరీతో ఇండియా ఫైనల్ చేరడం కష్టమేం కాబోదు.