ఒకేసారి ఎన్ని సమస్యలొచ్చినా భారత్ ఎదుర్కోగలదు: బిల్ గేట్స్

ఒకేసారి ఎన్ని సమస్యలొచ్చినా భారత్ ఎదుర్కోగలదు: బిల్ గేట్స్

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ సాధించిన విజయాల గురించి గేట్స్ నోట్స్ అనే తన బ్లాగ్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశం భవిష్యత్తుపై ఆశను కల్పిస్తో్ంది. ప్రపంచ దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా భారత్ అలాంటి పెద్ద సమస్యలను ఒకేసారి పరిష్కరించగలదని బిల్ గేట్స్ అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా భారత్ లో ఉన్నా.. పోలియోను తరిమికొట్టడంలో, పేదరికాన్ని కంట్రోల్ చేయడంలో, హెచ్ ఐవీ వ్యాప్తిని అరికట్టడంలో, శిశు మరణాలు తగ్గించడంలో, ఆర్థిక అవసరాలు, పారిశుద్ధ్యంలో పనులు చేయించడంలో భారత్ పనితీరు గొప్పగా ఉందని బిల్ గేట్స్ అన్నారు.

భారత్ ప్రస్తుతం ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. రోటా వైరస్, కరోనా వైరస్ లాంటి వాటికి మందును భారత్ లోనే తయారుచేశారు. వీటికోసం గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తానని వెల్లడించారు. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్(ఐఎఆర్ఇ) పరిశోధనలకోసం గేట్స్‌ ఫౌండేషన్‌ భారత  సంస్థలతో చేతులు కలిపిందని బిల్ గేట్స్ తెలిపారు.