కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు చేలరేగి ఆడారు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించింది. టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లి, పంత్ అర్ధ సెంచరీలతో మెరిశారు. టీమిండియా ప్రారంభంలోనే కిషన్ వికెట్ కోల్పోయింది.
తర్వాత కోహ్లి, రోహిత్ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఫస్ట్ నుంచే దూకుడుగా ఆడాడు. 41 బాల్స్ లో కోహ్లి 52 పరుగులు సాధించాడు. చివర్లలో పంత్, వెంకటేశ్ అయ్యర్ బౌండరీల వర్షం కురిపించారు. పంత్ 28 బంతుల్లోనే 58 పరుగులు సాధించగా, అయ్యర్ 18 బంతుల్లో 33 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో ఛేజ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
Rishabh Pant brings up his fifty from just 27 balls ?
— ICC (@ICC) February 18, 2022
India finish their innings on 186/5. #INDvWI | https://t.co/a9C8ROsj1Y pic.twitter.com/zJ9EM28eXX
