గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మళ్లీ డ్రా

గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మళ్లీ డ్రా

సెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూసియా : ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సింక్యూఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో డ్రా నమోదు చేశాడు. ఇండియాకే చెందిన యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానందతో గురువారం జరిగిన మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాతో గట్టెక్కాడు. నల్ల పావులతో గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అద్భుతమైన ఆరంభం లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. క్యాటలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రజ్ఞానంద.. సహచరుడిని అడ్డుకున్నాడు. దీంతో నాలుగు నిమిషాల్లో 18 ఎత్తులు వేసిన గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరకు గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రాగా ముగించాడు. 2022 నుంచి క్లాసికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజ్ఞానంద.. 

గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించలేదు. ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇద్దరూ చెరో ఒకటిన్నర పాయింట్లతో కొనసాగుతున్నారు. ఇతర గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఫ్యాబియానో కరువాన (అమెరికా, 1.5)... నొడిర్బెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్దుసత్తారోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 1)పై, ఇయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెపోమినెట్చి (రష్యా, 2).. అనిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిరి (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 1)పై గెలవగా, అలీరెజా ఫిరౌజ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2).. మ్యాక్సిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాచిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాగ్రెవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 1.5), డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీరెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (చైనా, 1.5).. వెస్లీ సో (అమెరికా, 1.5) మధ్య జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు డ్రా అయ్యాయి.