ఈసారి 6.4 శాతం వృద్ధి.. వెల్లడించిన ఎస్ అండ్​ పీ

ఈసారి 6.4 శాతం వృద్ధి..  వెల్లడించిన ఎస్ అండ్​ పీ

న్యూఢిల్లీ :  అధిక ఆహార ఇన్​ఫ్లేషన్ (ధరల పెరుగుదల),  బలహీన ఎగుమతుల వంటి అడ్డంకులను సమర్థంగా ఎదుర్కొంటున్న భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి సాధించవచ్చని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సోమవారం ప్రకటించింది. ఈసారి మనదేశం ఆరు శాతం గ్రోత్​ సాధిస్తుందని ఈ సంస్థ గతంలో ప్రకటించగా, ప్రస్తుతం దానిని పెంచింది. రాబోయే ఆర్థిక సంవత్సరం (2024-–25) వృద్ధి అంచనాలను 6.9 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది.   హయ్యర్​ బేస్​ వల్ల  వృద్ధి తగ్గుదల, గ్లోబల్​ గ్రోత్​ నెమ్మదించడం, వడ్డీ రేట్ల ప్రభావం ఇందుకు కారణాలని పేర్కొంది.  ఎస్​ అండ్​ పీ అంచనాలు ఇతర అంతర్జాతీయ ఏజెన్సీల కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.3 శాతం వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్​, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ,  ఫిచ్ అంచనా వేస్తున్నాయి. 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ అంచనా వేసింది. మార్చి 2023తో ముగిసిన 2022–-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి చెందింది. మార్చి క్వార్టర్​లో 6.1 శాతంగా ఉన్న దేశ వాస్తవ జీడీపీ జూన్ క్వార్టర్​లో వార్షిక ప్రాతిపదికన 7.8 శాతం పెరిగింది. ఇన్​ఫ్లేషన్​ను తగ్గించడానికి ఆర్​బీఐ గత ఏడాది మే నుంచి బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్లు పెంచింది.  ఈ ఫిబ్రవరి నుంచి రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. 

అధిక డిమాండ్​ కారణంగా భారతదేశం, ఇండోనేషియా, మలేషియా,  ఫిలిప్పీన్స్ వంటి ఆర్థిక వ్యవస్థలలో ఈ సంవత్సరం,  తదుపరి సంవత్సరం వృద్ధి పటిష్టంగా ఉంటుందని ఎస్​ అండ్​పీ తన ఆసియా పసిఫిక్ ఎకనామిక్ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. దీని ప్రకారం.. భారతదేశంలో ప్రైవేట్ వినియోగదారుల ఖర్చు కంటే స్థిర పెట్టుబడులు వేగంగా పుంజుకున్నాయి. మనదేశంలో -సెప్టెంబర్ క్వార్టర్​లో ఆహార ఇన్​ఫ్లేషన్​లో తాత్కాలిక పెరుగుదల ఉంది. ఇప్పటికీ, హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఇన్​ఫ్లేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉంది.