ఇండియా వేగంగా ఎదుగుతోంది : క్రెడిట్​ సూజ్​

ఇండియా వేగంగా  ఎదుగుతోంది : క్రెడిట్​ సూజ్​

ముంబై: అధికారిక డేటా చెబుతున్న దానికంటే వేగంగా ఇండియా ఎదుగుతోందని క్రెడిట్​ సూజ్​ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండియాలోని కంపెనీల ఈక్విటీ షేర్ల అవుట్​లుక్​ అప్​గ్రేడ్​ కావాల్సి ఉందని పేర్కొంది. గతంలోని అండర్​వెయిట్​ కేటగిరీ నుంచి మన దేశపు కంపెనీల ఈక్విటీ షేర్లకు అవుట్​లుక్​ను బెంచ్​మార్క్​కు అప్​గ్రేడ్​ చేశామని వెల్లడించింది. బెంచ్​మార్క్​ ఇండెక్స్​లు మరో 14 శాతం దాకా పెరగడానికి ఛాన్స్​ ఉందని వివరించింది. 2024 ఫైనాన్షియల్​ ఇయర్లో ఇండియా 7 శాతం గ్రోత్​సాధిస్తుందని క్రెడిట్​ సూజ్​ రీసెర్చ్​ హెడ్​ నీల్​కాంత్​ మిశ్రా చెప్పారు. ఇండియా గ్రోత్​ 6 శాతానికే పరిమితమవుతుందని చాలా మంది అంచనాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారిక డేటాను తీసుకునే చాలా మంది తమ అంచనాలు రూపొందించారని, తాము మాత్రం మరింత లోతుగా డేటాను విశ్లేషించి ఈ నిర్ణయానికి వచ్చామని మిశ్రా చెప్పారు.

డెన్స్​ ఫ్యూయెల్స్​ గ్రోత్​ తీసుకుంటే గత మూడేళ్లలో 4 శాతం పెరిగిందని, అలాగే బీఎస్​ఈ 500 కంపెనీల రెవెన్యూ గ్రోత్​ కూడా వృద్ధి వేగమవుతుందనే సూచిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని చాలా అంశాల కారణంగా ఇండియా జీడీపీ గ్రోత్​ 2023 లో పటిష్టంగా ఉంటుందని మిశ్రా చెప్పారు. ప్రభుత్వ ఖర్చు పెరగడంతోపాటు, తక్కువ జీతాల ఉద్యోగాలూ పెరిగాయని అన్నారు. ఎనర్జీ కోసం దిగుమతులపై ఆధారపడటంతోపాటే, గ్రోత్​ కోసం విదేశీ పెట్టుబడుల వైపే చూడటం వంటివి ఇండియాకున్న రిస్క్​ ఫ్యాక్టర్లని మిశ్రా వెల్లడించారు.