ఫిడే వరల్డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సెమీస్ చేరిన ఇండియా

ఫిడే వరల్డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సెమీస్ చేరిన ఇండియా

జెరూసలేం: ఫిడే వరల్డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా సెమీఫైనల్‌‌‌‌ చేరుకుంది. గురువారం జరిగిన క్వార్టర్స్‌‌‌‌లో  ఇండియా బ్లిట్జ్‌‌‌‌ టై బ్రేక్‌‌‌‌లో 2.5–1.5తో ఫ్రాన్స్‌‌‌‌ను ఓడించింది. నిహాల్‌‌‌‌ సరిన్‌‌‌‌, ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ నారాయణన్ తమ గేమ్స్‌‌‌‌లో విజయాలు సాధించి ఇండియాను గెలిపించారు.

అంతకుముందు రెండు సెట్ల మ్యాచ్‌‌‌‌ల్లో ఇరు జట్లూ సమంగా నిలిచాయి. తొలి సెట్‌‌‌‌ను ఇండియా 3–1తో గెలుచుకోగా.. రెండో సెట్‌‌‌‌ను ఫ్రాన్స్‌‌‌‌ 3–1తో సొంతం చేసుకుంది. దాంతో, విజేతను నిర్ణయించేందుకు టై బ్రేక్‌‌‌‌ నిర్వహించగా.. ఇండియన్స్‌‌‌‌ సత్తా చాటి ముందంజ వేశారు.