IND vs AFG: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత్.. తిలక్ వర్మ స్థానంలో కోహ్లీ

IND vs AFG: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత్.. తిలక్ వర్మ స్థానంలో కోహ్లీ

భారత్, ఆఫ్ఘనిస్థాన్ రెండో టీ20 ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఇండోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే భారత్ 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తుంటే..ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇవ్వాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఇప్పుడు చూడాలి. 

ఈ మ్యాచ్ లో భారత్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. తిలక్ వర్మ స్థానంలో కోహ్లీ, గిల్ స్థానంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ వచ్చి చేరారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ రహ్మత్ షా స్థానంలో స్పిన్నర్ నూర్ అహ్మద్ ను తుది జట్టులోకి తీసుకుంది.     

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-జీబ్ హక్

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్