
డ్యూటీ పెంపుపై ఆభరణాల రంగం అసంతృప్తి
ముంబై: బంగారం దిగుమతులపై కస్టమ్ డ్యూటీని పెంచడంపై నగల వ్యాపారులు మండిపడ్డారు . దీనివల్ల ఆభరణాల రంగం దెబ్బతినడమే గాక, అక్రమ రవాణా పెరుగుతుందని విమర్శించారు. నగల అమ్మకాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేమార్కె ట్‌లో అమ్మకాలు పెరగడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. బంగారంపై కస్టమ్ డ్యూటీ,జీఎస్టీ 15.5 శాతం పెంచడం వల్ల, గ్రేమార్కె ట్ అమ్మకాలు అధికమవుతాయని ఆలిండియా జెమ్ అండ్ జ్యూయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ అన్నారు.
‘‘ఇది వరకే స్మగ్లింగ్ ఎక్కువగా ఉంది . ఇది మరింత పెరుగుతుంది. ఫలితంగా 5 శాతం వరకు డిస్కౌం ట్ ఇస్తారు. అంతిమంగా గ్రేమార్కె ట్ 30 శాతం పెరుగుతుందన్నది మా అంచనా’’ అని వివరించారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ (ఇండియా) సోమసుందరం సైతం ఈ అభిప్రాయాన్ని సమర్థించారు. బంగారంపై కస్టమ్ డ్యూటీని 10 శాతం నుంచి12.5 శాతం పెంచడం పసిడి పరిశ్రమను దెబ్బతీస్తుందని చెప్పారు.
బంగారాన్ని అసెట్ క్లాస్ గా మార్చాలన్న ప్రయత్నాలు విఫలమవుతాయి. గ్రేమార్కె ట్ తోపాటు నగదు లావాదేవీలూ పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్ తమను తీవ్రంగా నిరాశపర్చిందని జెమ్స్ అండ్ జ్యూయలరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కొలిన్ షా అన్నారు. ప్రభుత్వం నిర్ణయం ఫలితంగా బంగారు నగల ఎగుమతులు తగ్గుతాయని, వ్యాపార ఖర్చులు, స్మగ్లింగ్ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బంగారం దిగుమతులను తగ్గించడానికి, డిజిటల్ గోల్డ్‌ను , గోల్డ్ బాండ్లను ప్రోత్సహించడానికే ప్రభుత్వం ఇలా చేసిందని ఏబన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అభిషేక్ బన్సల్ విశ్లేషించారు. బంగారం ధరలు మరింత పెరిగితే డిమాండ్ తగ్గు తుందని చెప్పారు . కస్టమ్ డ్యూటీ పెంపు వల్ల అమ్మకాలు తగ్గు తాయని కల్యాణ్ జ్యూయలర్స్ సీఎండీటీఎస్ కల్యాణ రామన్ అన్నారు