జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్, వెలుగు: తాము అభివృద్ధి చేసి మాత్రమే ఓట్లు అడుగుతున్నామని.. మరి బీఆర్ఎస్, ఇతర పార్టీలకు ఓట్లు ఎందుకు వేయాలో ప్రజలే నిలదీయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో శనివారం ఎర్రగడ్డ డివిజన్ లో మంత్రి ప్రచారం నిర్వహించారు. సుల్తాన్ నగర్ లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోరారు.
ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు సమానంగా అందుతున్నాయని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు ఉచిత కరెంటు, సున్న వడ్డీకే రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు పంపిణీ వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామని వివరించారు.
