కూటమి లక్ష్యం ..గ్లోబల్ బయోఫ్యూయల్​పై ఆశలు

కూటమి లక్ష్యం ..గ్లోబల్  బయోఫ్యూయల్​పై ఆశలు

జీ20 సమావేశాలు భారతదేశంలో మొదటిసారిగా జరిగాయి. గ్రూప్ ఆఫ్ ట్వంటీ అనేది అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం ప్రధాన వేదిక ఇది. 19 దేశాలు,  యూరోపియన్ యూనియన్ ఇందులో ఉన్నాయి. ఇది ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సమావేశాల్లో పాల్గొన్న అమెరికా, అర్జెంటినా, బ్రెజిల్, బంగ్లాదేశ్, మారిషస్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల నేతల సమక్షంలో ప్రధాని మోదీ ‘ప్రపంచ  జీవ ఇంధన కూటమి’ ని ప్రారంభించారు. 19 దేశాలు, 12 ప్రపంచ సంస్థలు ఈ కూటమిలో చేరేందుకు అంగీకరించాయి. 

ప్రధాని ఆశాభావం

ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రారంభించిన మోదీ ఇలా అన్నారు.. ‘ఇంధన మిశ్రమంలో అన్ని దేశాలు కలిసిపనిచేయడం ప్రస్తుత అవసరం. పెట్రోల్లో ఇథైల్ ఆల్కహాల్ 20 శాతం వరకు కలపడానికి ప్రపంచ స్థాయిలో చొరవ తీసుకోవాలనేది మా ప్రతిపాదన లేదా ప్రపంచ ప్రయోజనాల కోసం, స్థిరమైన ఇంధన సరఫరా కోసం, వాతావరణ భద్రతకు సహకరించే 
ప్రత్యామ్నా య బ్లెండింగ్ మిశ్రమాన్ని వృద్ధి చేయడానికి మనమందరం కృషిచేద్దాం. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని భారతదేశం మిమ్మలందరినీ ఆహ్వా నిస్తోంది’ అని ప్రధానమంత్రి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చా రు. నీతి అయోగ్ ప్రచురించిన సమాచారం పక్రారం, ఇ20 పెట్రోల్ సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. అదేవిధంగా అది పెట్రోల్ కంటే తక్కువ ధరకు లభించే పర్యావరణ అనుకూల ఇంధనం. 

జీవ ఇంధనాలు అంటే ఏమిటి? 

వృక్ష సంబంధిత పదార్థాలు ఉదాహరణకు పంట వ్యర్ధాలు లేదా జంతు సంబంధిత పదార్థాలు ఉదాహరణకు పేడ లేదా ఆహార సంబంధిత పదార్థాలు మొక్కజొన్నకంకి వంటి వాటి నుండి తయారు చేసేఇంధనాలను ‘జీవ ఇంధనాలు’ అని అంటారు. ఉదాహరణకు గ్రామాల్లో విరివిగా వాడే గోబర్ గ్యా స్. గోబర్ గ్యాస్ ను పేడ నుండి లేక పంట వ్యర్థాల నుంచి లేక ఆహార వ్యర్ధాల నుండి తయారుచేస్తారు. గోబర్ గ్యాస్ లో ఉండే ప్రధాన వాయువు మీథేన్. వృక్ష సంబంధిత నూనెల నుండి తయారు చేసే బయో డీజిల్ జీవ ఇంధనాలకు మరొక ఉదాహరణ. శిలాజ ఇంధనాల కంటే జీవ ఇంధనాలు పూర్తిగా పర్యావరణ అనుకూలమైన, పునరుత్పాదక ఇంధనాలు . 

భారత్ కు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? 

ప్రపంచ జీవ ఇంధన కూటమి జీ20 దేశాలకు వచ్చే మూడేళ్లలో 500 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన అవకాశాలను సృష్టించగలదని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ కూటమి వలన దేశాలకు, పర్యావరణానికి ప్రయోజనం చేకూరుతుందని, ఇతర ఇంధనాలతో పోలిస్తే బయోగ్యాస్ తయారీకి కావలసిన ముడి పదార్థాలు చాలా సులభంగా లభ్యమవుతాయి కాబట్టి బయో గ్యాస్ తయారీకి కావాల్సిన పెట్టుబడి ఖర్చు చాలా తక్కు వగా ఉంటుంది అని ఇండియన్ బయోగ్యా స్ అసోసియేషన్ పేర్కొంది. ప్రపంచ జీవ ఇంధన కూటమిలోని దేశాల మధ్య, ఇతర దేశాల సహకారంతో పర్యావరణ అనుకూల ఇంధనాలకు సంబంధించిన సాంకేతిక సహకారం, సాంకేతిక బదిలీ, శిలాజ ఇంధనాలపై తక్కు వగా ఆధారపడటం వంటివి భారతదేశానికి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో జీ20 దేశాలకు ఈ కూటమి సహకరిస్తుందని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ తెలిపింది. ఈదేశాలు తమ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది అని అంచనా వేస్తున్నారు. పునరుత్పా దక ఇంధన మంత్రిత్వ శాఖ పక్రారం, భారతదేశంలో బయోగ్యా స్, కంప్రెస్డ్ బయో గ్యా స్ ప్రస్తుత రోజువారీ ఉత్పత్తి 1151 మెట్రిక్ టన్నులు. ఈ రంగంలో  2025 నాటికి సమిష్టి కృషితో రోజుకు 1750 మెట్రిక్ టన్నులకు పెరగవచ్చని అంచనాలు 
సూచిస్తున్నా యి.

జీవ ఇంధనాలపై ప్రత్యేకమైన ఆసక్తిఎందుకు? 

వాతావరణ మార్పులు ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న అతిపెద్దసమస్య. వాతావరణ మార్పుల వల్లనే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, కరువు కాటకాలు రావటం, అకాల వర్షాలు, తీవ్రమైన తుఫానులు సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పులకు ప్రధాన కారణం పెట్రోలు వంటి శిలాజ ఇంధనాలను మండించడం, కార్బన్ డయాక్సైడ్ వంటి హరితవాయులు వాతావరణంలోకి విడుదలై అది గ్లోబల్ వార్మింగ్​కు దారితీసి, తద్వారా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. 2021 సంవత్సరంలో స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరంలో నిర్వహించిన కాప్ 26 సదస్సులో భారతదేశం 2030 నాటికి 50% కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని, 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కేంద్రప్రభుత్వం వివిధ రకాలైన పర్యావరణ అనుకూల ఇంధనాలు ప్రోత్సహిస్తుంది. జీవ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు భారత పభ్రుత్వం ‘జీవ ఇంధనాలపై జాతీయ విధానం–2018’ ని  ప్రకటించింది. 

జీవ ఇంధనాలతో దేశ ఆర్థిక ప్రయోజనాలు 

రైతులకు ఆర్థికంగా ప్రయోజనకారిగా ఉంటుంది. గత 8 సంవత్సరాల కాలంలో ఈ10 అనే ఇంధనాన్ని వాడటం వల్ల భారతదేశానికి ₹53,894 కోట్ల వరకు విదేశీ మారకదవ్ర్యం ఆదా అయింది. అలాగే రూ. 49,078 కోట్లు  ఆదాయం రైతులకు సమకూరింది. ఇది318 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించింది. 2020-–25 సంవత్సర కాలంలో భారత దేశంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగంపై ఒక పణ్రాళికను నీతి అయోగ్ రూపొందించింది. ఈ పణ్రాళికలో నీతి అయోగ్ ప్రచురించిన సమాచారం ప్రకారం, భారత దేశంలో రవాణా రంగంలో 98% శిలాజ ఇంధనాలు వాడుతుండగా కేవలం 2% మాత్రమే జీవ ఇంధనాలు వాడుతున్నాం.జీవ ఇంధనాలు భారతదేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అనేక ఆర్థిక లాభాలతో పాటు, ఇది పర్యావరణానికి అనుకూలం కూడా.

కూటమి లక్ష్యం ..

జీవ ఇంధన సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడం, స్థిరమైన జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం, విస్తృత శ్రేణి వాటాదారుల క్రియాశీల ప్రమేయం ద్వారా బలమైన లేక నాణ్యమైన ప్రమాణాలు, ధృవీకరణ ప్రక్రియలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా జీవ ఇంధనాల వినియోగాన్ని వేగవంతం చేయడం ప్రపంచ జీవ ఇంధన కూటమి లక్ష్యం. ఈ కూటమి విజ్ఞాన కేంద్రంగా, నిపుణుల కేంద్రంగా పనిచేస్తుంది. జీవ ఇంధనాలను అభివృద్ధిచేయడంలో, విస్తృతంగా అమలు చేయడంలో ఈ కూటమి ప్రపంచానికి తోడ్పడుతుంది. 

- డా. శ్రీధరాల రాము,
ఫ్యాకల్టీ, కెమిస్ట్రీ అండ్ 
ఎన్వి రాన్మెంటల్ సైన్సెస్