ఆసియా పసిఫిక్​ ప్రాంతంలో ఈ ఘనత సాధించిన తొలి దేశం భారత్

ఆసియా పసిఫిక్​ ప్రాంతంలో ఈ ఘనత సాధించిన తొలి దేశం భారత్

ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఏఏఐ) గగన్​ (జీపీఎస్​ ఎయిడెడ్​ జీయో ఆగ్మెంటెడ్​ నావిగేషన్​ ) పేరుతో సరికొత్త స్వదేశీ ఉపగ్రహ ఆధారిత ఆగ్మెంటేషన్​ సిస్టిమ్​(ఎస్​బీఏఎస్​) సాంకేతికతను వర్తింపజేయడం ద్వారా విజయవంతంగా భారతదేశం ట్రయల్​ నిర్వహించింది. రాజస్తాన్​లోని కిషన్​గఢ్​ విమానాశ్రయంలో ఇండిగో విమానం దిగుతున్నప్పుడు దేశీయంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత నావిగేషన్​ సిస్టమ్​ను ఉపయోగించిన ఆసియాలో మొదటి విమానయాన సంస్థగా అవతరించింది. ఆసియా పసిఫిక్​ ప్రాంతంలో ఈ ఘనత సాధించిన తొలి దేశం భారత్​. 

అభివృద్ధి

ఇస్రో, ఏఏఐ సంయుక్తంగా గగన్​ను అభివృద్ధి చేశాయి. అప్లింక్​, రిఫరెన్స్​ స్టేషన్లను ఉపయోగించడం ద్వారా ఈ సిస్టమ్​ ఎయిర్​ ట్రాఫిక్​ నిర్వహణను మెరుగుపరచడానికి జీపీఎస్​ సిగ్నల్​ దిద్దుబాట్లను సరిచేస్తుంది. 

గగన్​ 

పౌర విమానయాన అనువర్తనాలకు అవసరమైన సమగ్రత, కచ్చితత్వంతో ఉపగ్రహ ఆధారిత నావిగేషన్​ సేవలను అందించే ఉపగ్రహ ఆధారిత వృద్ధి వ్యవస్థ. ఈ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా భారత గగనతలంలో మెరుగైన ఎయిర్​ ట్రాఫిక్​ నిర్వహణను అందించవచ్చు. గగన్​ సిగ్నల్​ ఇన్​ స్పేస్​ (ఎస్​ఐఎస్) జీశాట్​–10, జీశాట్​–8 ద్వారా అందుబాటులో ఉంది. కచ్చితమైన ల్యాండింగ్​ ప్రయోజనం కోసం విమానం రేడియో నావిగేషన్​ సహాయాలపై ఆధారపడాలి. అయినా చిన్న విమానాశ్రయాల్లో ఆధునిక నావిగేషన్​ సహాయాల కొరత ఉంది. అందువల్ల అలాంటి విమానాశ్రయాల్లో విజిబిలిటీ అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కిషన్​గఢ్​ విమానాశ్రయంలో అన్ని సాధారణ ప్రయాణికుల విమానాలకు దృశ్యమానత అవసరం, కానీ గగన్​ సాంకేతికతను ఉపయోగించి, ఒక విమానం దాదాపు 800 మీటర్ల దృశ్యమానతతో పనిచేస్తుంది.