హైదరాబాద్ మిలిటరీ కాలేజీలో ఉద్యోగాలు.. ఇంటర్ పాసైన నిరుద్యోగులకు మంచి ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

హైదరాబాద్ మిలిటరీ కాలేజీలో ఉద్యోగాలు.. ఇంటర్ పాసైన నిరుద్యోగులకు మంచి ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

హైదరాబాద్ తిరుమలగిరిలోని మిలటరీ కాలేజ్ ఆఫ్​ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (MCEME) గ్రూప్ –సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 14. 

పోస్టుల సంఖ్య: 49. 

పోస్టులు: లోయర్ డివిజన్ క్లర్క్ 05, స్టెనోగ్రాఫర్ గ్రేడ్–I 02, లాబొరేటరీ అసిస్టెంట్ 03, సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఓజీ) 01, బూట్​మేకర్ ఎక్విప్​మెంట్ రీపెయిరర్ 02, బార్బర్ 01, మల్టీ– టాస్కింగ్ స్టాఫ్​ 25, ట్రేడ్స్​​మెన్ మేట్ 10. 

ఎలిజిబిలిటీ
లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-–I : గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణత. 

లాబొరేటరీ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులుగా సైన్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్​లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఓజీ), బూట్​మేకర్ ఎక్విప్​మెంట్ రీపెయిరర్, మల్టీ- టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్​మెన్ మేట్: పదోతరగతి పూర్తి చేసి ఉండాలి. 

బార్బర్: పదోతరగతితో పాటు బార్బర్ ట్రేడ్ జాబ్​లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 25.

లాస్ట్ డేట్: నవంబర్ 14.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్/ ట్రేడ్​ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్  ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఎగ్జామ్ ప్యాటర్న్
 ఓఎంఆర్ పద్ధతిలో ఎగ్జామ్ ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. 120 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉన్నది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. 
లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, లాబొరేటరీ అసిస్టెంట్, సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఓజీ)
పార్ట్-I: జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ – 25 ప్రశ్నలు, 25 మార్కులు.
పార్ట్-II: జనరల్ అవేర్​నెస్ – 25 ప్రశ్నలు, 25 మార్కులు.
పార్ట్-III: జనరల్ ఇంగ్లిష్ – 50 ప్రశ్నలు, 50 మార్కులు.
పార్ట్-IV: న్యూమరికల్ ఆప్టిట్యూడ్ – 50  ప్రశ్నలు, 50 మార్కులు. 
మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులు. 

బూట్​మేకర్ ఎక్విప్​మెంట్ రీపెయిరర్, బార్బర్, మల్టి - టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్​మెన్ మేట్
పార్ట్-I: జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ -50 ప్రశ్నలు, 50 మార్కులు.
పార్ట్-II: జనరల్ అవేర్​నెస్ 50  ప్రశ్నలు, 50 మార్కులు.
పార్ట్-III: జనరల్ ఇంగ్లిష్ - 25 ప్రశ్నలు, 25 మార్కులు.
పార్ట్-IV: న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25  ప్రశ్నలు, 25 మార్కులు. 
మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులు. 

పూర్తి వివరాలకు indianarmy.nic.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.