దేశంలో కొత్తగా 17,073 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 17,073 కరోనా కేసులు నమోదు

దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 17 వేల మర్కు దాటాయి. ఇక ఆదివారం 3.03 లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా.. దేశవ్యాప్తంగా కొత్తగా 17,073 కరోనా కేసులు నమోదయ్యాయని తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో కరోనా కారణంగా 21 మంది మరణించారు.

ఇప్పటివరకు మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 4,34,07,046 కు, మరణాల సంఖ్య 5,25,020కు చేరినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసులు 94,420,గా ఉన్నాయని తెలిపింది. దేశంలో ఆదివారం నాటికి 1,97,11 ,91 ,329 టెస్టులు చేశారు. కాగా, దేశంలో యాక్టివ్ కేసుల రేటు 0.21 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.58 శాతానికి పడిపోయింది.