దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

న్యూఢిల్లీ : దేశంలో కరోనావ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 16,299 మంది కొత్తగా కొవిడ్ బారిన పడ్డారు. వీరితో కలుపుకొని దేశంలో మొత్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 4,42,06,996కు చేరింది. గడిచిన 24 గంటల్లో 19,431 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకోగా, 54 మంది కరోనా కాటుకు బలయ్యారు. కేసులు తగ్గడంతో రికవరీ రేటు 4.58శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 1,28,261 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 25,75,389 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వీరితో కలుపుకొని ఇప్పటి వకు 207.94 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 2,146 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు ఒక్కసారిగా 17.83శాతానికి పెరిగింది. కరోనా కారణంగా 8మంది మృత్యువాతపడ్డారు. ఫిబ్రవరి 13 తర్వాత ఇంత భారీ సంఖ్యలో మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. అటు మహారాష్ట్రలోనూ కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. ఆ రాష్ట్రంలో బుధవారం 1,847మందికి కొత్తగా కరోనా సోకగా.. ఏడుగురు చనిపోయారు. ఒక్క ముంబయి మహానగరంలోనే 852 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం 11,889 యాక్టివ్ కేసులు ఉన్నాయి.