ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు చుక్కెదురు

ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు చుక్కెదురు

దోహా: ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి పట్టింది. మంగళవారం జరిగిన  రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఖరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో 1–2తో  బలమైన ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో పోరాడి ఓడిపోయింది. మూడో రౌండ్ చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన ఈ పోరులో 37వ నిమిషంలో లలియన్జులా చాంగ్టే  చేసిన గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా 1–0తో లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చింది. డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా ఆడుతూ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాపాడుకుంది. కానీ, 73వ నిమిషంలోయూసుఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఐయెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టిన వివాదాస్పద గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఖతార్ స్కోరు సమం చేసింది. 

తొలుత యూసుఫ్ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియా కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ హెడ్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా.. బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్లే ఏరియా అవతలకు వెళ్లిపోవడంతో  ఇండియా ప్లేయర్లంతా ఆగిపోయారు. కానీ, రిఫరీ  విజిల్ వేయకపోవడంతో అల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో యూసుఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంతిని మళ్లీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి పంపించాడు. దీనిపై ఇండియాప్లేయర్లు ప్రొటెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా రిఫరీ గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రకటించాడు. 85వ నిమిషంలో అల్ రావి చేసిన గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఖతార్ విజయం ఖాయమైంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందే ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (16 పాయింట్లు) టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూడో రౌండ్ చేరగా..  మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కువైట్ 1–0తో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి 7 పాయింట్లు, రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముందంజ వేసింది. ఇండియా (5 పాయింట్లు) మూడో స్థానంతో సరిపెట్టింది.