
జోహోర్ (మలేసియా): ఇండియా మెన్స్ జూనియర్ హాకీ టీమ్.. సుల్తాన్ జోహోర్ కప్‌లో రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 4–2తో న్యూజిలాండ్‌పై గెలిచింది. అర్ష్‌దీప్ సింగ్ (2వ ని), పీబీ సునీల్ (15వ ని), అరైజిత్ సింగ్ హుందాల్ (26వ ని), రోమన్ కుముర్ (47వ ని) ఇండియాకు గోల్స్ అందించారు. కివీస్ ప్లేయర్లు గస్ నీల్సన్ (41వ ని), ఐడెన్ మ్యాక్స్ (52వ ని) గోల్స్ కొట్టారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండియన్ ఫార్వర్డ్స్ రెండో నిమిషంలోనే ఫలితాన్ని సాధించారు. కివీస్ పేలవ డిఫెన్స్‌ను ఆసరాగా చేసుకుని అర్ష్‌దీప్ రైట్ ఫ్లాంక్ నుంచి సూపర్ షాట్ కొట్టాడు.
తొలి క్వార్టర్ ముగిసే టైమ్‌లోపు సునీల్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. 2–0 లీడ్‌తో సెకండాఫ్‌ను మొదలుపెట్టిన ఇండియాకు మూడో క్వార్టర్‌లో అరైజిత్ సింగ్ మరో గోల్ అందించాడు. అయితే మూడో క్వార్టర్‌లో అటాకింగ్ పెంచిన కివీస్ ప్లేయర్ నీల్సన్ గోల్ చేశాడు. ఆ వెంటనే లభించిన పెనాల్టీని రోమన్ ర్ గోల్ కొట్టడంతో ఇండియా ఆధిక్యం 4–1కి పెరిగింది. చివర్లో వ్యూహాత్మకంగా ఆడిన కివీస్ 52వ నిమిషంలో రెండో గోల్ సాధించినా.. ఇండియా విజయాన్ని అడ్డుకోలేకపోయింది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఇండియా.. పాకిస్తాన్‌తో తలపడుతుంది.