జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ టోర్నీలో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరువగా భారత్

జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ టోర్నీలో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరువగా భారత్

మోకి: జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ టోర్నీలో ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 7–3తో సౌత్ కొరియాపై అద్భుత విజయం సాధించి సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడుగు దూరంలో నిలిచింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్మోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కా (5, 56వ నిమిషం) రెండు గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (18వ ని), అజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (20వ ని), ప్రభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (42వ ని), గుర్సేవక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (55వ ని), ఆర్యన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (58వ ని) మిగతా గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించారు. 

కొరియా తరఫున డోహ్యోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (6వ ని), హ్యోగుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (19వ ని), యూ (36వ ని) గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆరంభం నుంచి ఇరుజట్లు బంతిపై పట్టు కోసం హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో నిమిషాల వ్యవధిలో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. అయితే చివరి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడు నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టి పైచేయి సాధించారు. బుధవారం చైనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తైపీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిస్తే ఇండియాకు సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాయమవుతుంది. 

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఇండియా 7–0తో జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 9 పాయింట్లు సాధించిన ఇండియా ఎలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఇండియా ప్లేయర్లు కృష్ణ శర్మ (5వ ని), సుప్రియ (9వ ని), పూర్ణిమ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (14, 46వ ని), గీతా యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (41, 45వ ని), సనిక చంద్రకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానే (50వ ని) గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టారు. బుధవారం జరిగే ఆఖరి పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా.. చైనాతో తలపడతారు.