అహ్మదాబాద్: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో ఇండియా విలుకాండ్లు సత్తా చాటారు. మంగళవారం జరిగిన పోటీల్లో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం గెలిచారు. మెన్స్ కాంపౌండ్ టీమ్ ఫైనల్లో వరల్డ్ చాంపియన్ తోమన్ కుమార్–శ్యామ్ సుందర్ స్వామి 152–139 తేడాతో ఇరాక్‌పై గెలిచి స్వర్ణం సాధించారు. రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో హర్విందర్ సింగ్–విజయ్ సుండి జోడీ తొలి సెట్ చేజార్చుకున్నా.. 6–2తో స్లొవేకియాపై నెగ్గి రెండో స్వర్ణాన్ని అందించారు.
విమెన్స్ రికర్వ్ టీమ్ ఫైనల్లో భావన–పూజా జోడీ 0–6తో చైనా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. మిక్స్‌డ్ టీమ్ డబ్ల్యూ–1 ఈవెంట్‌లో స్వాతి చౌదరి–ఆదిల్ మొహమ్మద్ నజీర్ అన్సారి 1–5తో సర్కా పుల్టర్ ముసిలోవా–డేవిడ్ డ్రానోస్కీ (చెక్) చేతిలో ఓడి సిల్వర్‌ను సొంతం చేసుకున్నారు. తర్వాత జరిగిన ఇండివిడ్యువల్ డబ్ల్యూ–1 విభాగంలో స్వాతి చౌదరి 6–2తో ఎలెనా కృటోవా (రష్యా)పై గెలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. విమెన్స్ కాంపౌండ్ టీమ్ విభాగం బ్రాంజ్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో శీతల్ దేవి–పాయల్ నాగ్.. చైనా చేతిలో ఓడి తృటిలో పతకాన్ని కోల్పోయారు.
