న్యూఢిల్లీ: ఇండియా కబడ్డీ ప్లేయర్ బ్రిజేంద్ర సింగ్ చౌదరి డోప్ పరీక్షలో పట్టుబడ్డాడు. ఫలితంగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆసియా బీచ్ గేమ్స్‌లో సాధించిన సిల్వర్ మెడల్‌ను వెనక్కి తీసుకున్నారు. ఏప్రిల్ 27న నిర్వహించిన డోప్ టెస్ట్‌లో బ్రిజేంద్ర నిషేధిత బ్రింజోలమైడ్ తీసుకున్నట్లు శాంపిల్స్‌లో బయటపడింది. దాంతో ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) అతనిపై వేటు వేసింది. ఐటీఏ విధించిన శిక్షణను బ్రిజేంద్ర అంగీకరించాడు. వాడా రూల్స్ ప్రకారం బ్రింజోలమైడ్‌ను మాస్కింగ్ ఏజెంట్‌గా పరిగణిస్తారు. దీన్ని ఇన్ అండ్ ఔటాఫ్ కాంపిటీషన్‌లో వాడకుండా నిషేధించారు.
