ఇండియాకు ఇన్నోవేషన్స్‌ ​అవసరం : పీయుష్​గోయల్​

ఇండియాకు ఇన్నోవేషన్స్‌ ​అవసరం :  పీయుష్​గోయల్​
  • అన్ని దేశాలూ స్టార్టప్​లకు సాయం చేయాలె

న్యూఢిల్లీ/హైదరాబాద్​: గ్లోబల్​ స్టార్టప్​ ఎకోసిస్టమ్​ను బలోపేతం చేయడానికి మెంటర్లు, ఇన్వెస్టర్లు, ఎంట్రప్రెన్యూర్లతో కూడిన ఇంటర్నేషనల్​ నెట్​వర్క్​ అవసరమని కేంద్ర పరిశ్రమలు, ఆహార, జౌళిశాఖల మంత్రి పీయుష్​ గోయల్​ అన్నారు. ఈ నెట్​వర్క్​ఒక బృందంగా ఏర్పడి స్టార్టప్​లకు సాయం చేయాలని, ఉత్తమ విధానాలను, ఆలోచనలను అందరూ పంచుకోవాలని సూచించారు. ఆర్​ అండ్​ డీ కోసం కలసి పనిచేయాలన్నారు. హైదరాబాద్​లో శనివారం జరిగిన స్టార్టప్​20 ఎంగేజ్​మెంట్​ గ్రూఫ్​ ఆఫ్​ 20 ఇన్సెప్షన్​ మీటింగ్​ను ఉద్దేశించి వర్చువల్​గా మాట్లాడారు. అన్ని దేశాలూ ఇన్నోవేషన్లను, స్టార్టప్​లను సపోర్ట్​ చేయాలని సూచించారు. దీనివల్ల ప్రపంచ సమస్యలను పరిష్కరించగల గ్లోబల్​ స్టార్టప్​ ఎకోసిస్టమ్​ ఏర్పడుతుందని అన్నారు. గ్లోబల్​ స్టార్టప్​ ఎకోసిస్టమ్​లో ఇండియాకు తగినంత ప్రాధాన్యం ఉందని, ఇన్నోవేషన్స్‌​కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణమని కామెంట్​ చేశారు.  

ఎంట్రప్రిన్యూర్​షిప్​ను పెంపొందించడంలో  కొత్త  కొత్త ఆలోచనలను ప్రోత్సహించడంలో ఇది సహాయపడిందని మంత్రి పేర్కొన్నారు.   స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌లు వృద్ధి చెందడానికి  అభివృద్ధి చెందడానికి సహాయపడిందని ఆయన అన్నారు. ఫుడ్​, ఎనర్జీ, ఫిన్​టెక్​ వంటి రంగాల్లో ఇండియా స్టార్టప్‌‌‌‌లు సత్తా చాటాయని గోయల్ తెలియజేశారు. హైదరాబాద్​లో జరిగిన సమావేశాలకు కేంద్ర వాణిజ్య,-పరిశ్రమల శాఖ సహాయమంత్రి  సోమ్ ప్రకాష్,  ‘స్టార్టప్20’  బృందం చైర్మన్‌‌‌‌ డాక్టర్ చింతన్ వైష్ణవ్, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి  జయేష్ రంజన్, పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కార్యదర్శి  అనురాగ్ జైన్, నీతి ఆయోగ్‌‌‌‌ సీఈవో   పరమేశ్వరన్ అయ్యర్‌‌‌‌, భారత జీ20 షెర్పా  అమితాబ్‌‌‌‌ కాంత్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.