రేపట్నుంచి భారత్-న్యూజిలాండ్ టెస్టు ఛాంపియన్ షిప్

V6 Velugu Posted on Jun 17, 2021

  • తుది జట్టును ఖరారు చేసిన భారత్

సౌథాంప్టన్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు (శుక్రవారం) నుంచి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యామ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.  సౌథాంప్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ పై అంచనాలు హైఓల్టేజ్ కు చేరుకున్నాయి. ఈ  నేపధ్యంలో భారత్ తుది జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ఖరారు చేసింది. కోహ్లి కెప్టెన్ గా.. రెహానే వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కివీస్ ను ఓడించి ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న భారత్ 10 నెంబర్ ఆటగాడు కూడా బ్యాట్ ఝుళిపించే రీతిలో జట్టును ప్రకటించారు. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు బ్యాటింగ్ లో కూడా రాణిస్తున్న నేపధ్యంలో వీరితోపాటు ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. 
భారత్ జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రెహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, ఛటేశ్వర్ పూజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్),రవీంద్ర జడేజా, అశ్విన్, బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి. 

Tagged Team india, , World Test Championship final, India vs New Zealand, WTC Test Championship, cricket india

Latest Videos

Subscribe Now

More News