కాల్పుల విరమణ స్వాగతిస్తున్నాం.. జమ్మూకాశ్మీర్ లో సహాయక చర్యలు ప్రారంభించండి:ఒమర్ అబ్దుల్లా

కాల్పుల విరమణ స్వాగతిస్తున్నాం.. జమ్మూకాశ్మీర్ లో సహాయక చర్యలు ప్రారంభించండి:ఒమర్ అబ్దుల్లా

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందాన్ని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. పాకిస్తాన్ దుశ్చర్యలకు నష్టపోయిన జమ్మూకాశ్మీర్ ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వం తక్షణ కర్తవ్యం.. వెంటనే జరిగిన నష్టాన్ని  అంచనా వేసి రిపోర్టులు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఒమర్ అబ్దుల్లా కోరారు.  

కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాం.. ఇది రెండు మూడు రోజులకు ముందే జరిగి ఉండే ప్రాణనష్టం ఉండేది కాదు.. పాకిస్తాన్ డీజీఎంఓ మా డీజీఎంవోకు ఫోన్ చేసి కాల్పుల విరమణ అమలు చేశారు.. నష్టాన్ని అంచనా వేయడం, సహాయక చర్యలు ప్రారంభించడం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ బాధ్యత అని ’’ ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

గాయపడిన కాశ్మీర్ ప్రజలకు ప్రభుత్వం మంచి వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.  ప్రభావిత కుటుంబాలకు సాయం అందించేందుకు సర్వేలు నిర్వహించి వెంటనే రిపోర్టు పంపాలని డీసీలకు ఆదేశించారు. దీంతోపాటు మూసివేయబడిన ఎయిర్ పోర్టులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. 

భారత్, పాకిస్తాన్ మధ్య గడిచిన కొద్ది సంవత్సరాల్లో అత్యంత తీవ్రమైన సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏప్రిల్ 22, 2025న పహల్గాంలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 26మంది అమాయకపు టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్  ఈ దాడిని సీరియస్ గా తీసుకుంది.  ఈ క్రమంలో ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని ప్రకటించారు. 

►ALSO READ | 26/11 దాడులకు ప్రతీకారం.. ముంబై దాడి సూత్రధారిని మట్టుపెట్టిన భారత సైన్యం

మే 7, 2025 న భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను మెరుపు దాడులు నిర్వహించింది భారత సైన్యం..ఈ దాడుల్లో పాక్ లోని పలు ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం అయ్యాయి. కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే భారత్ చేస్తే.. పాకిస్తాన్ మాత్రం సరిహద్దుల్లోని భారత్ ప్రాంతాలపై దాడులు చేసింది..దీంతో శనివారం భారత్ సాయుధ దళాల అధిపతులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పాక్ కాల్పుల విరమణకు..బాంబు దాడులను నిలిపివేయడం భారత్ ఆగ్రహానికి గురికాకుండా వెనక్కి తగ్గినట్లే అని తెలుస్తోంది. ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలు, రెండు దేశాల మధ్య కాల్పులు, సైనిక చర్యలతో భారత్ కంటే పాకిస్థాన్ తీరని నష్టాన్ని చవిచూసింది.. ఇదే విషయాన్ని భారత్ కల్నల్ సోఫియా ఖురేషి స్పస్టం చేసింది