భార‌త్ – చైనా స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌లో అమ‌రులైన 20 మంది జ‌వాన్లు వీరే..

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌లో అమ‌రులైన 20 మంది జ‌వాన్లు వీరే..

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దులో లడఖ్‌లోని గాల్వన్‌ లోయలో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మ‌ద్య జ‌రిగిన ఘర్షణల్లో మరణించిన 20 మంది సైనికుల పేర్లను భారత ఆర్మీ విడుదల చేసింది. తొలుత ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా ఇద్దరు జవాన్లు మరణించారని వెల్ల‌డించిన సైన్యం.. ఆ త‌ర్వాత మ‌రో 17 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ప్ర‌క‌ట‌న చేసింది. ప‌ర‌స్ప‌రం జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో తీవ్రంగా గాయ‌ప‌డి మైన‌స్ డిగ్రీల మంచు వాతావ‌ర‌ణంలో కుప్ప‌కూలిపోయి మ‌ర‌ణించిన‌ట్లు తెలిపింది.

20 మంది వీర జవాన్లు వీరే..

– కల్నల్‌ సంతోష్‌ బాబు – సూర్యాపేట (తెలంగాణ‌)

– నాయిబ్ సుబేదార్ నుదురమ్‌ సోరెన్ – మ‌యూర్ బంజ్, ఒడిశా

– నాయిబ్ సుబేదార్ మందీప్‌ సింగ్ – ప‌టియాలా, పంజాబ్

– నాయిబ్ సుబేదార్ సత్నాం సింగ్ – గురుదాస్‌పూర్, పంజాబ్

– హ‌వ‌ల్దార్ ప‌ళ‌ని – మ‌ధురై, త‌మిళ‌నాడు

– హ‌వ‌ల్దార్ సునీల్‌ కుమార్ – పాట్నా, బీహార్

– హ‌వ‌ల్దార్ విపుల్‌ రాయ్ – మీర‌ట్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్

– సిపాయి దీపక్‌ కుమార్ – రీవా, మ‌ధ్య‌ప్ర‌దేశ్

– సిపాయి రాజేష్ అరాంగ్ – బిర్భుమ్, ప‌శ్చిమ‌బెంగాల్

– సిపాయి కుందన్‌ కుమార్‌ ఓజా – సాహిబ్‌గంజ్, జార్ఖండ్

– సిపాయి గణేష్‌ రామ్ – కాంకేర్, చ‌త్తీస్‌గ‌ఢ్

– సిపాయి చంద్రకాంత ప్రధాన్ – కంద‌మాల్, ఒడిశా

– సిపాయి అంకుశ్ – హ‌మీర్పూర్, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్

– సిపాయి గుర్వీందర్ – సంగ్రూర్, పంజాబ్

– సిపాయి గురుతేజ్ సింగ్ – మాన్సా, పంజాబ్

– సిపాయి చందన్‌ కుమార్ – భోజ్‌పూర్, బీహార్

– సిపాయి కుందన్‌ కుమార్ – స‌హ‌స్ర‌, బీహార్

– సిపాయి అమన్‌ కుమార్ – స‌మ‌స్థిపూర్, బీహార్

– సిపాయి జై కిషోర్‌ సింగ్ – వైశాలి, బీహార్

– సిపాయి గణేశ్‌ హంస్ధా – ఈస్ట్ సింగ్భూర్, జార్ఖండ్