జనాభాలో దూసుకుపోతున్న భారత్

జనాభాలో దూసుకుపోతున్న భారత్

జనాభాలో భారత్ దూసుకుపోతోంది. కొన్నేళ్లలోనే చైనాను అధిగమించేలా ఉంది. 2010 నుంచి 2019 మధ్య మనదేశ జనాభా వార్షిక సగటు 1.2గా నమోదైంది. ఇదే కాలంలో చైనా పెరుగుదల రేటు 0.5 శాతంగానే ఉందని ఐక్యరాజ్యసమితి జనాభా సంస్థ నివేదిక విడుదల చేసింది. చైనా కంటే భారత్ జనాభా పెరుగుదల సగటు రెట్టింపు కన్నా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 142 కోట్లతో జనాభాలో చైనా మొదటి స్థానంలో ఉండగా 136 కోట్ల జనాభాతో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుత జనాభా పెరుగుదల రేటు ఆధారంగా లెక్కిస్తే… అతి త్వరలోనే చైనా జనాభాను భారత్ అధిగమించనుంది. మనదేశంలో 14 ఏళ్లలోపు వారు 27 శాతం ఉండగా.. 15 నుంచి 64 ఏళ్ల లోపు వయసు వారు 67 శాతం మంది ఉన్నారు. 65 ఏళ్లు దాటిన వారు ఆరు శాతం మంది ఉన్నారు.