నిరుద్యోగ రేటులో 4వ స్థానంలో భారత్

నిరుద్యోగ రేటులో 4వ స్థానంలో భారత్
  • మరోసారి మోడీ ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత చురకలు
  • మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయిందని వ్యాఖ్య
  • ప్రపంచ దేశాల నిరుద్యోగ రేటు జాబితాలో ఇండియా 4వ స్థానంపై మండిపాటు
  • అత్యంత తక్కువ నిరుద్యోగ రేటు గల దేశంగా వియత్నాం (7.3%)

గత కొన్ని రోజులుగా తెలంగాణ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత, మోడీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ సబ్సిడీ వంటి అంశాలపై ఇప్పటికే తనదైన శైలిలో విరుచుకుపడ్డ కవిత.. తాజాగా దేశంలో నిరుద్యోగ రేటును ప్రధాన అంశంగా తీసుకున్నారు. మోదీ పాలనలో నిరుద్యోగం రేటు భారీగా పెరిగిపోయిందని తెలిపారు. వివిధ దేశాల్లో అన్ ఎంప్లాయిమెంట్ పర్సెంటేజ్ చూపించే ఓ టేబుల్ ను జత చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. "ఈ డేటాను గమనించి... మోడీ ప్రభుత్వం భారతీయ యువతను ఎలా విఫలం చేసిందో అర్థం చేసుకోవాలని నేను నా యువ స్నేహితులను కోరుతున్నాను" అంటూ కామెంట్ చేశారు. మోడీ ఫెయిల్స్ యూత్ (#ModiFailsYouth) తో పోస్ట్ చేసిన కవిత.. వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ప్రకారం భారత్ లో 24.9 శాతం అన్ ఎంప్లాయిమెంట్ పర్సెంటేజ్ ఉందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారత్ నాలుగో స్థానంలో ఉండడం అత్యంత దారుణమైన విషయమంటూ ఆమె విమర్శించారు. 

 

మరిన్ని వార్తల కోసం...

సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడొద్దు, అధైర్యపడొద్దు

స్వీపర్‌‌‌‌‌‌‌‌ కొడుకు.. ఇక కలెక్టర్