
న్యూఢిల్లీ: బిజినెస్పరమైన అవినీతి విషయంలో ఇండియా 77వ స్థానంలో ఉందని యాంటీ–బ్రైబరీ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ‘ట్రేస్’ నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. ఈ విషయంలో మనదేశం స్కోరు 45గా (కమర్షియల్ బ్రైబరీ రిస్క్) రికార్డయింది. ట్రేస్ మొత్తం 194 దేశాల్లో స్టడీ చేసింది. దీని ప్రకారం.. నార్త్ కొరియా, తుర్కెమిస్తాన్, సౌత్ సూడాన్, వెనెజులా, ఎరిట్రియాలు అవినీతి విషయంలో ‘టాప్–5’గా నిలిచాయి. డెన్మార్క్, నార్వే, ఫిన్లండ్, స్వీడన్, న్యూజిలాండ్‌లో అవినీతి చాలా తక్కువగా ఉంది. గత ఏడాది కూడా ఇండియాకు కమర్షియల్ బ్రైబరీ రిస్క్ ఇండెక్స్‌లో 77వ ర్యాంకే వచ్చింది. గవర్నమెంటుతో బిజినెస్ పనులు, అవినీతిని అడ్డుకోవడం, చర్యలు తీసుకోవడం, పాలనలో పారదర్శకత, సామర్థ్యం అనే ఐదింటి ఆధారంగా ర్యాంకు ఇస్తారు. పాకిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ కంటే ఇండియాలోనే అవినీతి తక్కువని తేలింది. అయితే అవినీతిని తగ్గించేందుకు చైనా చాలా చర్యలు తీసుకుందని ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్ రిపోర్టు వివరించింది. ఇండియాతోపాటు పెరూ, జోర్డన్, నార్త్ మాసిడోనియా, కొలంబియా, మాంటినీగ్రో దేశాలకు 77వ ర్యాంకే వచ్చింది. ఈ స్టడీ కోసం ఇంటర్నేషనల్ఆర్గనైజేషన్ల నుంచి సమాచారం తీసుకున్నామని ట్రేస్ తెలిపింది.