దెబ్బకు దెబ్బ తీసేందుకు రెడీ అయిన ఇండియా.. ఇంగ్లండ్తో రెండో టెస్టులో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు !

దెబ్బకు దెబ్బ తీసేందుకు రెడీ అయిన ఇండియా.. ఇంగ్లండ్తో రెండో టెస్టులో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు !
  • ఇవాళ్టి (జులై 02) నుంచి ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో ఇండియా రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌.. 
  • బుమ్రాపై అదే సస్పెన్స్‌‌ ..
  • ఆకాశ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌లో ఒకరికి చాన్స్‌‌‌‌‌‌‌‌
  • మ. 3.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌, జియో హాట్‌‌స్టార్‌‌‌‌లో లైవ్‌‌

బర్మింగ్‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌: తొలి మ్యాచ్‌‌లో బ్యాటర్లు ఐదు సెంచరీలు కొట్టినా పరాజయం పాలైన టీమిండియా ఇంగ్లండ్‌‌ను దెబ్బకు దెబ్బ తీసేందుకు రెడీ అయింది. పిచ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు అనుకూలమని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో 20 వికెట్లు పడగొట్టడమే లక్ష్యంగా రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగుతోంది.  బుధవారం (జులై 02) మొదలయ్యే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలిచి లెక్క సరి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇందుకోసం టీమ్ సెలక్షన్‌‌లో మూస పద్ధతికి స్వస్థి చెప్పి పరిస్థితులకు అనుకూలమైన జట్టును బరిలోకి దించాలని ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. ఓవైపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ డెప్త్‌‌‌‌‌‌‌‌ను చూసుకుంటూనే మరోవైపు 20 వికెట్లు తీసే సత్తా ఉన్నా బౌలర్లతో కూడిన తుది జట్టును ఆడించేందుకు కసరత్తులు చేస్తోంది. దీని కోసం ఇద్దరు స్పిన్నర్లను ఆడించనున్నారు. అయితే లీడ్స్‌‌‌‌‌‌‌‌ పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ స్కోరు ఛేజింగ్‌‌లోనూ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేసేందుకు కసరత్తు చేస్తోంది. 

జడేజాకు తోడు ఎవరు?

బర్మింగ్‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌లో వాతావరణం చాలా వేడిగా ఉంది. పిచ్‌‌‌‌‌‌‌‌పై పచ్చిక ఉండటంతో ఉపరితలం పొడిగా కనిపిస్తోంది. మూడేండ్ల కిందట ఇదే గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 378 రన్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఛేదించి సిరీస్‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకుంది. ఇదే పిచ్‌‌‌‌‌‌‌‌పై కౌంటీ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకోవాలంటే జడేజాకు తోడుగా రెండో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ ఎవరనేది తేలాల్సి ఉంది. 

చివరి రెండు రోజులు పిచ్‌‌‌‌‌‌‌‌ స్పిన్‌‌‌‌‌‌‌‌కు అనుకూలమని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో స్పిన్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌, చైనామన్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక, పిచ్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించిన తర్వాతే స్టార్ పేసర్  బుమ్రా ఆడటంపై నిర్ణయం తీసుకుంటామని గిల్‌‌‌‌‌‌‌‌
 వెల్లడించాడు. ఒకవేళ బుమ్రా లేకపోతే పేస్‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌, ప్రసిధ్‌‌ కృష్ణకు తోడుగా ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌లో ఒకరు బరిలో ఉంటారు. అయితే ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లను నిలువరించాలంటే ముగ్గురు పేసర్లు లైన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌తో స్థిరత్వం పాటించాల్సిందే. 

క్యాచింగ్‌‌‌‌‌‌‌‌ మెరుగుపర్చుకోవడం కూడా ఇంండియా దృష్టిపెట్టాలి.  బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌, జైస్వాల్‌‌‌‌‌‌‌‌, రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌, శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ అద్భుతమైన ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. కాకపోతే సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌, కరుణ్‌‌‌‌‌‌‌‌ నాయర్‌‌‌‌‌‌‌‌ గాడిలో పడాల్సి ఉంది.  ఈ మ్యాచ్‌‌లోనూ ఫెయిలైతే రాబోయే మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో వీళ్లకు చోటు కష్టం కానుంది. 

పేస్‌‌‌‌‌‌‌‌తోనే దెబ్బ

తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌ విజయంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ మంచి జోరు మీదుంది. పరిస్థితులకు అనుకూలంగా బజ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ స్ట్రాటజీని పక్కాగా అమలు చేసిన ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌  ప్లేయర్లు ఈ పోరులోనూ దాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ నుంచి వైదొలిగాడు. అయినప్పటికీ క్రిస్‌‌‌‌‌‌‌‌ వోక్స్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని పేస్‌‌‌‌‌‌‌‌ దాడి నుంచి ఇండియాకు ముప్పు తప్పదు. 

తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఇండియాను రెండుసార్లు ఆలౌట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఆ టీమ్ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. లీడ్స్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ వికెట్లు తీయలేకపోయిన వోక్స్‌‌‌‌‌‌‌‌కు ఇది హోమ్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌. కొత్త బాల్‌‌‌‌‌‌‌‌తో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు అద్భుతమైన ఆరంభాన్ని అందించాలని భావిస్తున్నాడు. జోష్ టంగ్‌‌‌‌‌‌‌‌, బ్రైడన్‌‌‌‌‌‌‌‌ కార్స్‌‌‌‌‌‌‌‌, జెమీ స్మిత్‌‌‌‌‌‌‌‌ తలో చేయి వేస్తే ఇండియాకు కష్టాలు తప్పవు. ఏకైక స్పిన్నర్‌‌‌‌‌‌‌‌గా షోయబ్‌‌‌‌‌‌‌‌ బషీర్‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తున్నారు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు ఎలాంటి ఇబ్బందుల్లేవు. స్పోర్టింగ్‌‌‌‌‌‌‌‌ వికెట్లపై ఆ టీమ్ బ్యాటర్లు అదిరిపోయే స్కోర్లు అందిస్తున్నారు.


తుది జట్లు

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌: జాక్‌‌‌‌‌‌‌‌ క్రాలీ, బెన్‌‌‌‌‌‌‌‌ డకెల్‌‌‌‌‌‌‌‌, ఒలీ పోప్‌‌‌‌‌‌‌‌, జో రూట్‌‌‌‌‌‌‌‌, హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌, బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), జెమీ స్మిత్‌‌‌‌‌‌‌‌, క్రిస్‌‌‌‌‌‌‌‌ వోక్స్‌‌‌‌‌‌‌‌, బ్రైడన్‌‌‌‌‌‌‌‌ కార్స్‌‌‌‌‌‌‌‌, జోష్‌‌‌‌‌‌‌‌ టంగ్‌‌‌‌‌‌‌‌, షోయబ్‌‌‌‌‌‌‌‌ బషీర్‌‌‌‌‌‌‌‌. 
ఇండియా (అంచనా): జైస్వాల్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌, సుదర్శన్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), పంత్‌‌‌‌‌‌‌‌, కరుణ్‌‌‌‌‌‌‌‌, జడేజా, సుందర్‌‌‌‌‌‌‌‌/ కుల్దీప్‌‌‌‌‌‌‌‌, బుమ్రా/ అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ /ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌, సిరాజ్‌‌‌‌‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌.