WTC Finals : వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో ఫైనల్కు చేరిన టీమిండియా

WTC Finals :  వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో ఫైనల్కు చేరిన టీమిండియా

శ్రీలంకను న్యూజిలాండ్ ఓడిస్తుందా? వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో భారత్ ఫైనల్ చేరుతుందా? అని ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు ముందు అందరికీ ఉన్న టెన్షన్ ఇది. ఆదివారం క్రైస్ట్ చర్చ్ లో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్, శ్రీలంకపై ఉత్కంఠ విజయం సాధించింది. దాంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు రూట్ క్లియర్ అయింది. జూన్ 7న లండన్ లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ టైటిల్ కోసం తలపడనుంది. దీంతో వరుసగా రెండు సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన జట్టుగా భారత్ రికార్డు కొట్టింది.

తొలి టెస్టులో శ్రీలంకపై న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి రోజు 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. విలియమ్సన్ సెంచరీ(121నాటౌట్)కి తోడు మిచెల్ 81 రన్స్ తో రాణించడంతో న్యూజిలాండ్ గెలిచింది. మ్యాచ్ చివర్లో వన్డే తరహాలో ఆడిన కివీస్ శ్రీలంక ఆశలపై నీళ్లు చట్టింది.