దేశంలో ఒక్క ఏడాదిలో 9.3 లక్షల క్యాన్సర్ మరణాలు

దేశంలో ఒక్క ఏడాదిలో 9.3 లక్షల క్యాన్సర్ మరణాలు

న్యూఢిల్లీ :  క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నది. 2019లో మన దేశంలో ఏకంగా 9.3 లక్షల మందిని బలి తీసుకుంది. అదే ఏడాది మరో 12 లక్షల క్యాన్సర్ కేసులు ఇండియాలో కొత్తగా నమోదయ్యాయి. ఆసియాలో ఈ స్థాయిలో క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ విజృంభణ ఉన్న రెండో దేశం ఇండియానే. ఈ విషయాన్ని లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్‌‌‌‌ఈస్ట్ ఆసియా జర్నల్‌‌‌‌లో ప్రచురించారు. ‘‘కొత్తగా నమోదవుతున్న కేసులు, మరణాల విషయంలో ఆసియాలో చైనా, ఇండియా, జపాన్ టాప్‌‌‌‌లో ఉన్నాయి. 2019లో ఆసియాలో 94 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.

56 లక్షల మంది చనిపోయారు. చైనాలో 48 లక్షల కొత్త కేసులు, 27 లక్షల మరణాలు,  జపాన్‌‌‌‌లో 9 లక్షల కేసులు, 4.4 లక్షల మరణాలు రికార్డయ్యాయి” అని స్టడీలో వెల్లడించారు. ‘‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్, ఇంజురీస్, రిస్క్ ఫ్యాక్టర్స్ 2019 స్టడీ (జీబీడీ 2019)లోని గణాంకాల ఆధారంగా 49 ఆసియా దేశాల్లో నమోదైన 29 రకాల క్యాన్సర్ ప్యాటర్న్స్‌‌‌‌ను ఎగ్జామిన్ చేశాం” అని వివరించారు. నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కురుక్షేత్ర), ఎయిమ్స్ జోధ్‌‌‌‌పూర్, బతిండాకు చెందిన రీసెర్చర్లు, ఇంటర్నేషనల్ రీసెర్చర్లు కలిసి ఈ స్టడీ చేశారు.