కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదు

కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదు

దేశంలో కరోనా ఉదృతి  ఇంకా కొనసాగుతోంది. గడిచిన  24  గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,070  కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 43,469,234కి చేరుకుంది. మరో 23 మంది కరోనాతో మృతి చెందారు. అటు 14, 143 మంది  కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,07, 189 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.40%గా ఉంది. ఈ  మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్  విడుదల చేసింది.