మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని నెలలుగా కేసుల సంఖ్య తగ్గడంతో ఊపిరిపీల్చుకున్న జనాన్ని మళ్లీ కలవరపెడుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5వేలు దాటింది. మంగళవారం కొత్తగా 5,233 మంది కొవిడ్ బారినపడ్డారు. సోమవారంతో పోలిస్తే కేసుల సంఖ్య 41శాతం పెరిగింది. గత 24 గంటల్లో 3,345 మంది నుంచి వైరస్ నుంచి రికవర్ అయ్యారు. కరోనా కారణంగా నిన్న ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 28,857 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించారు. ఇప్పటి వరకు 194,43,26,415 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో మంగళవారం 1,881 మందికి కొత్తగా వైరస్ సోకింది. వారిలో ఒకరికి బీఏ 5 వేరియెంట్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క ముంబయి సిటీలోనే 1242 మంది కొత్తగా కొవిడ్ బారినపడ్డారు.సోమవారంతో పోలిస్తే ఈ సంఖ్య 81శాతం ఎక్కువ కావడం గమనార్హం. మహారాష్ట్రలో ఫిబ్రవరి 18 తర్వాత ఇన్ని కేసులు రికార్డు కావడం ఇదే తొలిసారి. అటు ఢిల్లీలోనూ మంగళవారం 450 కరోనా కేసులు వచ్చాయి. వైరస్ కారణంగా ఒకరు చనిపోయారు.