దేశంలో మళ్లీ పెరిగిన కేసులు

దేశంలో మళ్లీ పెరిగిన కేసులు

దేశంలో మళ్లీ కరోనా కేసులుపెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,608 కొత్త కరోనా వైరస్  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,98,864 కు చేరుకుంది.  ఇందులో 4,36,70,315 మంది బాధితులు కోలుకున్నారు.  కొత్తగా మరో 72 మంది కరోనాతో కన్నుమూశారు. దీంతో మరణాల సంఖ్య 5,27,206కు పెరిగింది.  గడిచిన 24 గంటల్లో16,251 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 1,01,343 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. రోజువారీ పాటివిటీ రేటు 3.48 శాతంగా, రికవరీ రేటు 98.58 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉంది.