ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు

ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు

ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఎగుమతి విధానాలను సవరించింది. యాంటీజెన్ టెస్ట్ కిట్ల ఎగుమతులను ఆంక్షల కేటగిరీలో చేర్చుతున్నామని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. 

దేశవ్యాప్తంగా యాంటిజెన్ కిట్లనే ఎక్కువగా కరోనా పరీక్షల కోసం వినియోగిస్తున్నారు. RTPCR పరీక్షల కంటే వేగంగా ఫలితాలు వస్తుండడంతో వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో RTPCR పరీక్షల కోసం ల్యాబ్ లు లేకపోవడంతో యాంటీజెన్ కిట్లు కీలకంగా మారాయి. థర్డ్ వేవ్ కు అవకాశం ఉందన్న హెచ్చరికలతో ఈ కిట్ల లభ్యతను పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. వీటి ఎగుమతిని ఆంక్షల జాబితాలో చేర్చింది. ఆంక్షల కేటగిరీలో ఉంచిన వస్తువులను ఎగుమతి చేయాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి.