వన్డేల్లో రెండో ర్యాంక్‌‌‌‌‌‌‌‌కు ఇండియా

వన్డేల్లో రెండో ర్యాంక్‌‌‌‌‌‌‌‌కు ఇండియా

దుబాయ్‌‌‌‌ : ఆసియా కప్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌ చేరుకున్న టీమిండియా వన్డేల్లో తన ర్యాంక్‌‌‌‌ను ఇంప్రూవ్‌‌‌‌ చేసుకుంది. తాజా లిస్ట్‌‌‌‌లో ఇండియా 116 పాయింట్లతో మూడు నుంచి  రెండో ర్యాంక్‌‌‌‌కు చేరుకుంది.  శ్రీలంక చేతిలో ఓడి ఆసియా కప్‌‌‌‌ నుంచి వైదొలిగిన పాకిస్తాన్‌‌‌‌ (115) రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 118 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో కొనసాగుతోంది. ఇండియా, ఆస్ట్రేలియా ఈ నెల 22 నుంచి మూడు వన్డేల సిరీస్‌‌‌‌లో పోటీ పడనున్నాయి. ఈ సిరీస్‌‌‌‌లో గెలిస్తే ఇండియా టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు చేరుకునే అవకాశం ఉంది.

ALSO READ: 21 ఏండ్ల ప్రస్థానానికి సొంతగడ్డపై ముగింపు