21 ఏండ్ల ప్రస్థానానికి సొంతగడ్డపై ముగింపు

21 ఏండ్ల ప్రస్థానానికి  సొంతగడ్డపై ముగింపు

లక్నో : ఇండియా టెన్నిస్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ రోహన్‌‌‌‌ బోపన్న డేవిస్‌‌‌‌ కప్‌‌‌‌లో తన 21 ఏండ్ల ప్రస్థానానికి  సొంతగడ్డపై ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాడు. ఈ టోర్నీలో భాగంగా శని, ఆదివారాల్లో మొరాకో జట్టుతో జరిగే మ్యాచ్‌‌‌‌లో ఇండియా ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగనుంది. ఏటీపీ సర్క్యూట్‌‌‌‌లో ఆట కొనసాగించనున్న  43 ఏండ్ల బోపన్న  డబుల్స్‌‌‌‌లో యూకీ భాంబ్రీతో కలిసి డేవిస్‌‌‌‌లో చివరి పోరు ఆడనున్నాడు. 

ALSO READ: ఫేవరెట్‌‌‌‌గా నీరజ్‌‌‌‌ చోప్రా.. నేడు డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌

సింగిల్స్‌‌‌‌లో సుమిత్‌‌‌‌ నాగల్‌‌‌‌ మంచి ఫామ్‌‌‌‌లో ఉన్నాడు. శశి కుమార్ ముకుంద్ ఎట్టకేలకు డేవిస్‌‌‌‌లో అరంగేట్రం చేయనున్నాడు. శనివారం జరిగే సింగిల్స్‌‌‌‌లో ముకుంద్‌‌‌‌..  యసిన్‌‌‌‌ డ్లిమితో, నాగల్‌‌‌‌.. ఆడమ్‌‌‌‌ మౌండిర్‌‌‌‌తో పోటీ పడనున్నారు. ఆదివారం డబుల్స్‌‌‌‌లో బోపన్న–యూకీ జోడీ.. యిలియట్‌‌‌‌–యోనెస్‌‌‌‌ లలామితో తలపడనుంది.