
భారతదేశం తాజాగా పాలస్తీనాకు రెండవ సహాయాన్ని పంపింది. ఈ పరిణామాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ధృవీకరించారు. ఈ విషయాన్ని ఆయన X ద్వారా తెలిపారు. "మేము పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని అందజేస్తూనే ఉన్నాము" అని అన్నారు. భారత వైమానిక దళానికి చెందిన రెండవ C17 విమానం 32 టన్నుల సాయంతో ఈజిప్ట్‌లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరిందని విదేశాంగ మంత్రి తెలిపారు.
అంతకుముందు భారతదేశం అక్టోబర్ 22న పాలస్తీనాకు వైద్య, విపత్తు సహాయంతో సహా మొదటి సహాయాన్ని పంపింది. ఎల్-అరిష్ విమానాశ్రయం గాజా స్ట్రిప్‌తో ఈజిప్ట్ సరిహద్దులో రాఫా క్రాసింగ్ నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం గాజాలోకి మానవతా సహాయం కోసం రాఫా మాత్రమే క్రాసింగ్ పాయింట్. అయితే, ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి క్రాసింగ్ పూర్తిగా పనిచేయడం ఆపేసింది.
We continue to deliver humanitarian assistance to the people of Palestine.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 19, 2023
Second @IAF_MCC C17 aircraft carrying 32 tonnes of aid departs for the El-Arish Airport in Egypt. pic.twitter.com/bNJ2EOJPaW