5వ తరం ఫైటర్ జెట్ నిర్మాణానికి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్..

5వ తరం ఫైటర్ జెట్ నిర్మాణానికి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్..

పాక్ పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ తో భారత రక్షణ శాఖ మరో మరో ముందడుగు వేసింది.. అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రోగ్రాం ఎగ్జిక్యూషన్ మోడల్ కి ఆమోదం తెలిపారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దీంతో 5వ తరం ఫైటర్ జెట్ నిర్మాణానికి సిద్ధమైంది ఇండియా. AMCA కార్యక్రమం భారతదేశ స్వదేశీ డిఫెన్స్ సామర్థ్యం పెరుగుతుందని.. దేశీయ ఏరో స్పేస్ సెక్టార్ లో ఆత్మనిర్బర్ భారత్ ను సాదించేందుకు తోడ్పడుతుందని తెలుస్తోంది.. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్రం.

పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ ఎగ్జిక్యూషన్ మోడల్ ప్రభుత్వ రంగ సంస్థలకు అవకాశాలను పెంచుతుందని భావిస్తున్నారు. ఆసక్తి ఉన్న సంస్థలు స్వతంత్రంగా, జాయింట్ వెంచర్‌లుగా, కన్సార్టియాలో భాగంగా బిడ్‌లను సమర్పించే అవకాశం ఉంది. బిడ్ ను సమర్పించే సంస్థలు భారతీయ కంపెనీలు అయి ఉండాలి, దేశ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని పేర్కొంది కేంద్రం.

ఈ ప్రోగ్రాం ద్వారా భారత్ 5వ తరం వైమానిక శక్తిలోకి దూసుకెళ్తుంది.. సెన్సార్ ఫ్యూజన్, ఇంటర్నల్ వెపన్ బేస్, అడ్వాన్స్‌డ్ ఏవియానిక్స్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యంతో సహా అత్యాధునిక సాంకేతికతలను కలిగి ఉన్న స్టెల్త్-సెంట్రిక్, మల్టీరోల్ ఫైటర్ జెట్‌గా రూపొందనుంది.