మార్పులను స్వీకరించడానికి భారతదేశం సిద్ధంగా ఉండాలి : దీపాన్వితా చటోపాధ్యాయ

మార్పులను స్వీకరించడానికి భారతదేశం సిద్ధంగా ఉండాలి : దీపాన్వితా చటోపాధ్యాయ

హైదరాబాద్, వెలుగు: వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలతో వాతావరణానికి కలిగే హానిని తగ్గించడానికి ఇన్నోవేటర్లు మరింత చురుగ్గా పనిచేయాలని ఐకేపీ చైర్మన్, సీఈవో  దీపాన్వితా చటోపాధ్యాయ తెలిపారు. ఈ ప్రీమియర్​ సైన్స్ పార్క్​, బిజినెస్​ ఇన్​క్యుబేటర్ 16వ ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ మిలీనియం కాన్ఫరెన్స్, ‘ఐకేఎంసీ 2022’ శనివారం హైదరాబాద్​లో మొదలయింది. ఇది ఆదివారం కూడా కొనసాగుతుంది. ఐకేపీ ఎకోసిస్టమ్​లు, ఇండస్ట్రీలు, ఇన్నోవేటర్లు..  మనుషులకు, పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను తగ్గించడానికి ఏం చేయాలనే విషయమై చర్చించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 

ఈ సందర్భంగా దీపాన్విత మాట్లాడుతూ మహమ్మారి తరువాత వచ్చిన మార్పులను స్వీకరించడానికి భారతదేశం  సిద్ధంగా ఉండాలన్నారు. ఐకేపీ వంటి ఎకోసిస్టమ్​ను బలోపేతం చేయడంపై  ఈ సందర్భంగా కీలక ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు, రౌండ్ టేబుల్‌‌‌‌‌‌‌‌ సమావేశాలు, వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌లు జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తమ సైన్స్ పార్క్ క్రమంగా శక్తివంతమైన  ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌గా ఎదిగిందన్నారు.   ఈ కార్యక్రమంలో పలు కంపెనీలు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, ఇన్నోవేటర్‌‌‌‌‌‌‌‌లు, ఇంక్యుబేటర్ మేనేజర్‌‌‌‌‌‌‌‌లు, నిపుణులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.   హెల్త్‌‌‌‌‌‌‌‌టెక్, మెడ్‌‌‌‌‌‌‌‌టెక్, బయోఫార్మా, ఇండస్ట్రియల్ బయోటెక్, అగ్రిటెక్, ఏఐ & ఎంఎల్​కు చెందిన కొన్ని స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు తమ టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నాయి.