యంగ్‌ క్రికెటర్ ధ్రువ్‌ జురెల్‌కు టీమిండియా నుంచి పిలుపు

యంగ్‌ క్రికెటర్ ధ్రువ్‌ జురెల్‌కు టీమిండియా నుంచి పిలుపు

ముంబై :  యంగ్‌ క్రికెటర్ ధ్రువ్‌ జురెల్‌కు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లండ్‌తో ఈ నెల 25 నుంచి జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు ఆలిండియా సీనియర్‌‌ సెలెక్షన్ కమిటీ శుక్రవారం టీమ్‌ను ప్రకటించింది. రోహిత్‌ కెప్టెన్సీలోని జట్టులో కొత్తగా 22 ఏండ్ల వికెట్ కీపర్ జురెల్‌కు చాన్స్ ఇచ్చింది. వైట్‌ బాల్‌ ఫార్మాట్‌లో ఆడుతున్న పేసర్‌‌ అవేశ్‌ ఖాన్‌ను  టెస్టు టీమ్‌లోకి తీసుకుంది. 

ఏడాది గ్యాప్ తర్వాత చైనామన్‌ స్పిన్నర్‌‌ కుల్దీప్‌ యాదవ్‌  కూడా రెడ్‌ బాల్ ఫార్మాట్‌లోకి వచ్చాడు.  ఏపీ కీపర్‌ కేఎస్‌ భరత్ తిరిగి నేషనల్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన సీనియర్‌‌ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. గాయం నుంచి కోలుకుంటున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా టీమ్‌కు దూరంగా ఉన్నాడు. తొలి టెస్టు ఈ నెల 25 నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. ఫిబ్రవరి 2 నుంచి జరిగే రెండో మ్యాచ్‌కు వైజాగ్‌ ఆతిథ్యం ఇస్తుంది. 

తొలి రెండు టెస్టులకు టీమ్:  రోహిత్ (కెప్టెన్), గిల్,యశస్వి జైస్వాల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), భరత్ (కీపర్), ధృవ్ జురెల్ (కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముకేష్ కుమార్, బుమ్రా (వైస్ కెప్టెన్ ), అవేష్ ఖాన్