ప్రతి ఒక్కర్నీ ఓడించొచ్చు : సింధు

ప్రతి ఒక్కర్నీ ఓడించొచ్చు : సింధు

పనాజీ : ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌లో తనకు గట్టి ప్రత్యర్థి అంటూ ఎవరూ లేరని.. ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు చెప్పింది. తనదైన రోజున ప్రతి ఒక్కర్నీ ఓడించొచ్చని వ్యాఖ్యానించింది. వరల్డ్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌ను పక్కనబెడితే ఆటలో అందరూ సమాన స్థాయిలోనే ఉన్నారంది. ‘ఎవరూ గట్టి ప్రత్యర్థి కాదు. అదే సమయంలో ప్రతి ఒక్కర్నీ ఓడించొచ్చు. ఇప్పుడున్న ప్లేయర్లందరిలోనూ సేమ్‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. ర్యాంక్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉన్నంత మాత్రాన  పోటీ ఎక్కువగా ఉంటుందని, వారిని ఓడించలేమని అనుకోవడం పొరపాటు. తక్కువ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌తో పోటీపడుతున్నప్పుడు ఈజీగా గెలుస్తామని అనుకోవద్దు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో మనం వందశాతం కష్టపడటమే ముఖ్యం. అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కర్నీ ఓడిస్తాం’ అని సింధు పేర్కొంది.