ఇస్తాంబుల్: ఇండియా స్టార్ రెజ్లర్లు అమన్ సెహ్రావత్.. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. వరల్డ్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శనివారం జరిగిన మెన్స్ 57 కేజీ క్వాలిఫికేషన్ బౌట్‌లో అమన్ 12–2తో హాన్ చోంగ్ సాంగ్ ( ఉత్తర కొరియా)ను ఓడించాడు. దీంతో ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో ఇండియాకు ఇదే తొలి ఒలింపిక్ బెర్త్ కావడం విశేషం. అంతకుముందు జరిగిన బౌట్స్‌లో అమన్ 12–2తో ఆండ్రి యాట్సెంకో (ఉక్రెయిన్)పై, 10–4తో జార్జి వాలెంటినోవ్ (బల్గేరియా)పై గెలిచాడు. 65 కేజీ సెమీస్‌లో సుజీత్ కల్కల్ 1–6తో తుమర్ ఒచిర్ (మంగోలియా) చేతిలో ఓడాడు.
పారిస్ బెర్త్ దక్కాలంటే సుజీత్.. ఆదివారం జరిగే బ్రాంజ్ బౌట్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది. క్వార్టర్స్‌లో 10–0తో లాచ్లాన్ మౌరిస్ మెక్నిల్ (కెనడా)పై గెలిచిన సుజీత్ తొలి రౌండ్‌లో 3–2తో ఉమిజాన్ జలాలోవ్ (ఉజ్బెకిస్తాన్)ను, ప్రిక్వార్టర్స్‌లో 10–0తో జన్‌స్కిన్ యున్ (కొరియా)ను ఓడించాడు. 74 కేజీ క్వార్టర్స్‌లో జైదీప్ అహ్లవత్ 0–3తో తైమురజ్ సల్కాజనోవ్ (స్లోవేకియా) చేతిలో ఓడాడు. ప్రిక్వార్టర్స్‌లో 5–3తో వాస్లీ డయాకోన్ (మల్డోవా)ను ఓడించాడు. ఇక భారీ ఆశలు పెట్టుకున్న దీపక్ పూనియా (97 కేజీ), సుమిత్ మాలిక్ (125 కేజీ) తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు.
