దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుజీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుజీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్​ రెజ్లర్లు దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూనియా (86 కేజీ), సుజీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (65 కేజీ) పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి.  ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్హత టోర్నీ అయిన ఆసియా క్వాలిఫయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం మంగళవారం ఈ ఇద్దరు కిర్గిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బిష్కెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)కు బయలుదేరి వెళ్లారు. కానీ దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ వర్షాలు కురవడంతో బిష్కెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లే విమానాలు అందుబాటులో లేవు.

శుక్రవారం నుంచి పోటీలు మొదలుకానున్న నేపథ్యంలో రెజ్లర్లు సకాలంలో అక్కడికి చేరుకుంటారా? లేదా? అన్న డౌట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలయ్యాయి. పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇది చివరి రెండో అర్హత టోర్నీ. రష్యా కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాలికోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజియో శుభమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుప్తాతో కలిసి ఇద్దరు రెజ్లర్లు గురువారం వరకు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉండిపోయారు. సరైన ఆహారం, నిద్ర లేకపోవడంతో వీళ్ల బరువులోనూ తేడాలు వచ్చాయి.