న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ టోర్నమెంట్ల కోసం ఇండియా జట్లను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) మంగళవారం ప్రకటించింది. ఆల్ ఇంగ్లండ్ రన్నరప్ లక్ష్య సేన్ థామస్ కప్‌లో మెన్స్ టీమ్‌కు నాయకత్వం వహించనుండగా.. ఉబెర్ కప్‌లో మాజీ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు అమ్మాయిల జట్టును ముందుండి నడిపించనుంది. 2022 ఎడిషన్ థామస్ కప్ నెగ్గి చరిత్ర సృష్టించిన కోర్ టీమ్‌ను దాదాపుగా కొనసాగించారు. ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు డెన్మార్క్‌లోని హోర్సెన్స్‌లో ఈ టోర్నీ జరగనుంది.
మెన్స్‌టీమ్: లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్. ప్రణయ్, కిరణ్ జార్జ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, హరిహరన్, ఎం.ఆర్. అర్జున్, ధ్రువ్ కపిల.
విమెన్స్ టీమ్: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వి శర్మ, దేవిక సిహాగ్, ఇషారాణి బారువా, ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి , కవిప్రియ సెల్వం, సిమ్రన్ సింఘి, తనీషా క్రాస్టో.
