టచ్ చేయాలంటే భయపడాలి: భారత్‌కు కొత్తగా 12 యుద్ధ విమానాలు

టచ్ చేయాలంటే భయపడాలి: భారత్‌కు కొత్తగా 12 యుద్ధ విమానాలు

సరిహద్దుల్లో పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత వైమానిక దళం మరింత సన్నద్ధమవుతోంది. డ్రాగన్ కంట్రీ చైనా కవ్వింపులు, దాయాది పాకిస్తాన్ నిబంధనల ఉల్లంఘనలను దృష్టిలో ఉంచుకొని.. తన బలాన్ని మరింత పెంచుకుంటోంది. తాజాగా రూ.11,000 కోట్ల వ్యయంతో 12 సుఖోయ్ సు-30ఎంకేఐలను కొనుగోలకు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. 

Also Read :- నేను అమెరికా అధ్యక్షుడినైతే..75% ఉద్యోగులను తీసేస్తా.. రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి

వీటిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారు చేయనుంది. విమానం అవసరాలకు అనుగుణంగా 60 శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. ఇవి బహుళ భారతీయ ఆయుధాలు మరియు సెన్సార్లతో కూడిన అత్యంత ఆధునిక సుఖోయ్ సు-30 విమానం అని రక్షణ అధికారులు తెలిపారు. సెప్టెంబరు 15న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగినట్లు వార్తా సంస్థ ఏఎన్ ఐ నివేదించింది. అలాగే, భారత నావికాదళం కోసం సర్వే నౌకల సేకరణకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఏసి) శుక్రవారం ఆమోదం తెలిపింది.