కర్తార్‌పూర్ గురుద్వారా గోపురాలను బాగుచేయించండి: పాక్‌ను కోరిన భారత్

కర్తార్‌పూర్ గురుద్వారా గోపురాలను బాగుచేయించండి: పాక్‌ను కోరిన భారత్

పాకిస్తాన్ కర్తార్‌పూర్ లోని సిక్కు మతస్థుల పుణ్యక్షేత్రం గురుద్వారా గోపురాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ను సదరు గోపురాలను బాగు చేయించాల్సిందిగా కోరింది. గత వారం కర్తార్ పూర్ లో పడిన భారీ వర్షానికి గోపురాలు పక్కకు ఒరిగాయి. అయితే నిర్మాణంలో నాణ్యత లేక పోవడంతో ఓ మోస్తారు వర్షానికే గోపురాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

సిక్కు మత స్థాపకులు గురు నానక్ సాహెబ్ … వారి జీవితపు చివరి సంవత్సరాలు కర్తార్‌పూర్ లో గడిచాయి. దీంతో అక్కడి గురుద్వారా సిక్కులకు పూజనీయ స్థలం. సిక్కు సమాజపు మనోభావాలను అర్థంచేసుకుని… కొత్తగా గోపురాలను నిర్మించాలని పాకిస్తాన్ ను భారత్ కోరింది.  సోషల్ మీడియాలో కూలిన గోపురాలను పరిశీలించినట్లయితే .. అవి నాణ్యతాలోపంగా కనిపించాయని అధికారులు తెలిపారు.

నవంబర్ 2019 లో కర్తార్ పూర్ కారిడార్ ను గురుద్వారాను దర్శించడానికి  నిర్మించింది పాకిస్తాన్ ప్రభుత్వం. దీంతో పాటు వీసా లేకుండా ఏడాది పొడవునా ప్రజలు గురుద్వారాను సందర్శించేందుకు ఇరు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. గురునానక్ సాహెబ్ 550వ జయంతి వార్శికోత్సవం సందర్భంగా గురుద్వారాకు యాత్రికులను వెళ్లడానికి అనుమతించారు. అయితే ప్రస్తుతం ఆ గురుద్వారా గోపురాలు నేలకూలడంతో బాగు చేయించాలని పాకిస్తాన్ ను భారత్ కోరింది.