
దుబాయ్: ఐసీసీ మెన్స్ టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైట్-బాల్ ఫార్మాట్లలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. సోమవారం విడుదలైన వన్డే, టీ20 తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లను నిలబెట్టుకుంది. గతేడాది మే నుంచి ఆడిన మ్యాచ్‌లను వంద శాతం, గత రెండేండ్లలో ఆడిన వాటిలో 50 శాతం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ రూపొందించారు. చాంపియన్స్ ట్రోఫీ విజయంతో ఇండియా వన్డేల్లో తన రేటింగ్ పాయింట్లను 122 నుంచి124కు పెంచుకొని టాప్ ప్లేస్‌ను మరింత బలోపేతం చేసుకుంది.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టాప్–3లో ఉన్నాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో వరల్డ్ చాంపియన్ ఇండియా, ఆసీస్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 126 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. ఇంగ్లండ్ రెండో ప్లేస్ చేరగా, సౌతాఫ్రికా మూడో, ఇండియా నాలుగో స్థానాలకు పడిపోయాయి.