కివీస్‌తో టీమిండియా ట్రాక్ రికార్డు ఎలా ఉందంటే?

కివీస్‌తో టీమిండియా ట్రాక్ రికార్డు ఎలా ఉందంటే?

ఇటీవల శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ లను గెలుచుకుని టీమిండియా, పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌ని కైవసం చేసుకుని న్యూజిలాండ్‌ జట్లు మంచి జోరు మీదున్నాయి. రేపటి నుంచి(జనవరి 18) ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. హైదరాబాద్‌  లోని ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. రెండో వన్డే జనవరి 21న రాయ్‌పూర్, మూడో వన్డే జనవరి 24న ఇందౌర్‌  లో  జరగనుంది.  జనవరి 27, 29,  ఫిబ్రవరి 1న ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది.  మరి ఇరు జట్ల మధ్య గత రికార్డులు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. 

వన్డే, టీ20ల్లో న్యూజిలాండ్‌పై టీమిండియాకు మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 113 వన్డే మ్యాచ్‌లు జరగగా 55 మ్యాచ్‌ల్లో ఇండియా గెలవగా, 50 మ్యాచ్‌ల్లో  న్యూజిలాండ్‌ విన్ అయింది. ఏడింటిలో ఫలితం తేలలేదు. ఇక టీ20ల్లో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 22 మ్యాచ్‌లు జరగగా, టీమిండియా 12, న్యూజిలాండ్‌ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది.