ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులు

ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులు
  • మాలిలో ఘటన..చర్యలు తీసుకోవాలని భారత్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో మంగళవారం ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్‌‌‌‌‌‌‌‌కు గురయ్యారు. కాయెస్ ప్రాంతంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై అల్-ఖైదాతో అనుబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జేఎన్ఐఎం) అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసింది. ఫ్యాక్టరీలోని కార్మికులను బందీలుగా తీసుకెళ్లగా.. వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) గురువారం ధ్రువీకరించింది. అయితే, కిడ్నాప్‌‌‌‌‌‌‌‌కు గురైన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. 

ముగ్గురు భారతీయుల కిడ్నాప్ ఘటనన తీవ్రంగా ఖండించిన కేంద్ర సర్కార్..బందీలను టెర్రరిస్టులు సురక్షితంగా  విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని కోరింది. మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం అధికారులు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. బాధిత కుటుంబాలతో టచ్ లో ఉన్నారు. మాలిలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఎంఈఏ సూచించింది. బం దీలను త్వరగా, సురక్షితంగా విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.